COVAXIN: నిమ్స్ లో కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్... తాజాగా ఐదుగురు వలంటీర్లకు తొలి డోసు

Clinical trials of Covaxin continues in NIMS

  • దేశవ్యాప్తంగా కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్
  • తొలిడోసు అందుకున్న వలంటీర్లపై 24 గంటల పరిశీలన 
  • ఆరోగ్యం నిలకడగా ఉంటే రేపు డిశ్చార్జి

భారత్ బయోటెక్ ఫార్మా పరిశోధన సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా షురూ అయ్యాయి.  హైదరాబాదు నిమ్స్ లోనూ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఎంపిక చేసిన ఐదుగురు వలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్ తొలి డోసు ఇచ్చారు. వారిని 24 గంటల పాటు నిమ్స్ వైద్యులు పరిశీలనలో ఉంచనున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంటే వారిని రేపు డిశ్చార్జి చేస్తారు. ఆపై 14 రోజుల పాటు ఇంటి వద్దనే అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఇప్పటివరకు నిమ్స్ లో ఎనిమిది మంది వలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News