Dil Brchara: సుశాంత్ చివరి సినిమా 'దిల్ బేచారా' చూసి తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్న ప్రముఖులు, అభిమానులు

After watching Dil Bechara fans gets emotional

  • సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచారా ఓటీటీలో రిలీజ్
  • అందరినీ కదిలించిన సుశాంత్ పెర్ఫార్మెన్స్
  • ముగింపు బాధాకరమంటూ పేర్కొన్న అభిమానులు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఆయన అభిమానులను తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో, సుశాంత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రదర్శితమవుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు.

ముఖేశ్ ఛాబ్రా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సుశాంత్ సరసన సంజన సంఘి కథానాయిక. ప్రఖ్యాత నవలా రచయిత జాన్ గ్రీన్ రచించిన 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే దీనిపై హాలీవుడ్ లో ఓ చిత్రం కూడా వచ్చింది.

'దిల్ బేచారా' సినిమా ఓటీటీ స్క్రీనింగ్ సందర్భంగా హీరోయిన్ సంజనా సంఘి మాట్లాడుతూ, సుశాంత్ తో తనది ప్రత్యేకమైన అనుబంధమని, ఇవాళ ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి ఇక్కడ లేకుండా పోయాడని తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

ఇక ఈ సినిమాపై రివ్యూలు సైతం ఎంతో సానుకూలంగా ఉన్నాయి. 'సుశాంత్ కు పర్ఫెక్ట్ సెండాఫ్' అంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. సుశాంత్ సింగ్ నటనకు ఈల వేయకుండా ఉండలేకపోయానని జెనీలియా డిసౌజా తెలిపింది. ఇలాంటి ముగింపు చాలా బాధాకరమని, సుశాంత్ జీవితం కూడా విషాదకరరీతిలోనే ముగిసిందని నెటిజన్లు సైతం బరువెక్కిన హృదయాలతో వ్యాఖ్యానించారు.

Dil Brchara
Sushant Singh Rajput
Sanjana Sanghi
OTT
Bollywood
  • Loading...

More Telugu News