Bill Gates: వ్యాక్సిన్ల పేరుతో మేం ఎప్పుడు డబ్బులు కూడబెట్టామో చూపించండి... విమర్శకులకు సవాల్ విసిరిన బిల్ గేట్స్

Bill Gates refuted ongoing criticism

  • కరోనా వ్యాప్తికి బిల్ గేట్స్ కారణమంటూ ప్రచారం
  • వ్యాక్సిన్ తో ప్రజలను చంపేందుకు కుట్ర అంటూ గేట్స్ పై ఆరోపణలు
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బిల్ గేట్స్

కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండగా, ఈ పరిశోధనలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి వెనుక బిల్ గేట్స్ హస్తం ఉందంటూ కుట్ర సిద్ధాంతాలు (కాన్స్ పిరసీ థీరీస్) ప్రచారంలోకి వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ ద్వారా భూమిపై 15 శాతం ప్రజలను అంతమొందించాలన్నది ఆయన లక్ష్యమని ఓ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది.

 దీనిపై బిల్ గేట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను వ్యాక్సిన్ల ద్వారా ఎప్పుడైనా చంపామా? వ్యాక్సిన్ల ద్వారా మేం ఎప్పుడైనా డబ్బు కూడబెట్టామా? ఎవరైనా నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. వాస్తవానికి ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల కోసం ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని, అనేక వ్యాక్సిన్ల రూపకల్పనతో తమకు సంబంధం ఉన్న మాట నిజమే అయినా, వ్యాక్సిన్లతో ప్రజలను చంపాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు.

Bill Gates
Vaccine
Corona Virus
COVID-19
Microsoft
  • Loading...

More Telugu News