Girl: నాకు పెళ్లి జరిగినా వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడు... అంటూ లేఖ రాసి ఓ యువతి ఆత్మహత్య

Girl commits suicide due to harassment of youth
  • జగిత్యాల జిల్లాలో విషాదం
  • ప్రేమ వ్యవహారంలో బలవన్మరణం చెందిన ఉమ
  • ప్రియుడి వ్యవహారంతో మనస్తాపం
తెలంగాణలో ఓ యువతి ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన ఉమ (19) అనే అమ్మాయి ఇంటర్ చదివింది. అదే గ్రామానికి చెందిన రంజిత్ తో ప్రేమలో పడింది. రంజిత్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు సరేనన్నారు. పెళ్లి చేసుకోవాలంటూ రంజిత్ ను కోరగా, అతడు తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దాంతో ఉమ కుటుంబం అతడితో తమకు కుదరదని నిశ్చయించుకుంది. ఉమకు వేరే సంబంధాలు చూడసాగారు.

కానీ రంజిత్ ఈ పెళ్లి సంబంధాలు చెడగొట్టేవాడు. మొదట్లో తప్పించుకుని తిరిగినవాడే మళ్లీ ఇప్పుడు తననే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చనిపోవాలని బెదిరించేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఉమ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఉమ సూసైడ్ నోట్ లో తన ఆవేదన వెలిబుచ్చింది.

"మమ్మీ, డాడీ నన్ను క్షమించండి. లవ్ చేశావ్ కదా... నన్నే పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు, లేకపోతే చచ్చిపోవాలట. నాకు పెళ్లి జరిగినా వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడు. నేను బతికి ఉండడం వల్ల మీకు బాధ తప్ప ఏమీ ఉండదు. వాడ్ని పెళ్లి చేసుకుని మీకు చెడ్డపేరు రానివ్వను... బతికుండి మిమ్మల్ని బాధించలేను... మిస్ యూ మమ్మీ, డాడీ!" అంటూ ఉమ తన సూసైడ్ నోట్ లో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Girl
Suicide
Love
Marriage
Police

More Telugu News