Balapur Ganesh: కీలక నిర్ణయాలను తీసుకున్న బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ

No Balapur laddu auction this year

  • వినాయకుడి విగ్రహం ఎత్తు 6 అడుగులు మాత్రమే
  • లడ్డూ వేలంపాట నిర్వహించకూడదని నిర్ణయం
  • భక్తులకు పూజలు, దర్శనాలు రద్దు

వినాయక చవితి దగ్గరపడుతోందంటే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్ బాలాపూర్ గణేషుడు. వేలంపాటలో బాలాపూర్ గణేశ్ లడ్డూను సొంతం చేసుకోవడానికి తీవ్ర పోటీ ఉంటుంది. మరోవైపు గణేశ్ శోభాయాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. బాలాపూర్ గణేశ్ బయల్దేరిన తర్వాతే ఓల్డ్ సిటీ నుంచి ఇంత వినాయకులు నిమజ్జనానికి బయల్దేరుతారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో, ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో, బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలను తీసుకుంది.

గణేశ్ విగ్రహాన్ని కేవలం 6 అడుగుల ఎత్తులో మాత్రమే తయారు చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ ఏడాది లడ్డూ వేలంపాట నిర్వహించకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఈ ఏడాది భక్తులకు ఎలాంటి పూజలు, దర్శనాలు వద్దని నిర్ణయించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, తమ నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. శోభాయాత్ర నాటికి అప్పటి పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలను మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News