America: అమెరికా కంటే వారం రోజుల ముందే.. నేడు చైనా మార్స్ మిషన్ ప్రయోగం!

China set to launch independent Mars mission Tianwen 1

  • అంగారకయాత్ర ప్రారంభించనున్న తియాన్వెన్-1
  • 5.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం అంగారక కక్ష్యలోకి
  • చైనా ప్రయోగంపై పెదవి విరిచిన అమెరికా

అమెరికాకు పోటీగా చైనా కూడా అంగారక యాత్రకు సిద్ధమైంది. అమెరికా ఈ నెల 30న అంగారక యాత్రకు సిద్ధమవుతుండగా, అంతకంటే వారం రోజుల ముందే అంటే నేడే చైనా తన ‘తియాన్వెన్-1’ వ్యోమనౌకను అంగారకుడిపైకి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక రాకెట్ లాంగ్‌మార్చ్-5 ద్వారా దీనిని ప్రయోగించనుంది. హెయినాన్ ప్రావిన్స్‌లోని వెన్‌చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.

తియాన్వెన్-1 మిషన్‌లో భాగంగా అంగారకుడిపైకి ఓ రోవర్, ల్యాండర్, ఆర్బిటర్‌లను చైనా పంపనుంది. ఏడు నెలల ప్రయాణం తర్వాత 5.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఫిబ్రవరి 2021న తియాన్వెన్-1 అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఆ తర్వాత ల్యాండర్ సాయంతో అంగారకుడిపైకి దిగి మట్టి నమూనాలు సేకరిస్తుంది.

చైనా ప్రయోగంపై అమెరికా వ్యోమగామి జొనాథన్ మెక్‌డొవెల్ పెదవి విరిచారు. ఇలాంటి ప్రయోగం చేపట్టడం చైనాకు ఇదే తొలిసారి కాబట్టి అమెరికా కంటే భిన్నంగా ఏదైనా సాధిస్తుందని ఊహంచలేమని పేర్కొన్నారు. కాగా, 1990 నుంచి అమెరికా ఇప్పటి వరకు నాలుగుసార్లు అంగారకుడిపైకి రోవర్లు పంపింది. 1975-76లో వైకింగ్ మిషన్‌‌లో భాగంగా పంపిన రోవర్, ల్యాండర్‌లను చైనా మిషన్ పోలి ఉందని జొనాథన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News