Kadiam Srihari: మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

Kadiam Srihari tests Corona positive

  • నిన్నటి వరకు హోం ఐసొలేషన్ లో ఉన్న కడియం శ్రీహరి
  • నిన్న సాయంత్రం పరీక్షలు  నిర్వహించిన వైద్యులు
  • నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందనున్న కడియం

తెలంగాణలో కరోనా కేసులు 50 వేలకు చేరబోతున్నాయి. ప్రతిరోజు అటూఇటుగా 1,500 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రజల్లో తిరుగుతుండడం వల్ల ప్రజాప్రతినిధులు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు కరోనా సోకింది.

తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటి వరకు ఆయన హోం ఐసొలేషన్ లోనే ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయనకు పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందనున్నట్టు సమాచారం. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఆయన భార్య, కుమారుడు, పనిమనిషికి కూడా కరోనా సోకింది.

Kadiam Srihari
Corona Positive
TRS
  • Loading...

More Telugu News