Venkaiah Naidu: రాజ్యసభ సభ్యులుగా ఆళ్ల, పిల్లి సుభాష్‌‌, మోపిదేవి ప్రమాణం

newly electred mps take oath

  • ప్రమాణ స్వీకారం చేయించిన‌ వెంకయ్య నాయుడు
  • హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
  • తెలుగులో చేసిన పిల్లి సుభాష్‌, మోపిదేవి

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆ సభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు.

మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ కారణాంతరాల వల్ల ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆయన మరో రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఎన్నికైన విషయం తెలిసిందే. వారిలో కొంతమంది ఈ రోజు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోయారు.

Venkaiah Naidu
Alla Nani
Pilli Subhas Chandra Bose
Mopidevi Venkataramana
  • Loading...

More Telugu News