Biswabhusan Harichandan: నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమించండి: ఏపీ గవర్నర్‌ ఆదేశాలు జారీ

goverer writes letter to ap govt on sec

  • ఇప్పటికే ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ వినతిపత్రం
  • నిర్ణయం తీసుకున్న గవర్నర్
  • ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ  

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగిస్తూ‌ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టు సూచన మేరకు ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశమై వినతి పత్రం కూడా సమర్పించారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ పంపారు.

Biswabhusan Harichandan
Nimmagadda Ramesh Kumar
Andhra Pradesh
  • Loading...

More Telugu News