Corona Virus: కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత.. ఎవరికీ చెప్పకుండా దుబాయ్ కి వెళ్లిపోయిన మహిళ!

Pune Lady Escapes to Dubai After Corona Positive
  • 11న పాజిటివ్ గా తేలిన పూణె మహిళ
  • హోమ్ క్వారంటైన్ లో ఉండాలని చెప్పిన అధికారులు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఓ మహిళ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన తరువాత దుబాయ్ కి వెళ్లిపోయిన ఘటన పూణెలో జరిగింది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా వీర విజృంభణ చేస్తున్న వేళ ఈ మహిళ చేసిన నిర్వాకం అధికారులను ఆందోళనకు గురి చేసింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, పూణెకు చెందిన ఓ మహిళకు ఈ నెల 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆపై ఆమెను 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని బయటకు రాకుండా చికిత్స చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. వాటిని పట్టించుకోని ఆమె, ముంబయి నుంచి దుబాయ్ కి వెళుతున్న విమానంలో టికెట్ కొనుగోలు చేసి, ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్లిపోయింది. ఆమెలో వ్యాధి లక్షణాలు కనిపించక పోవడంతోనే, ఆమె విమానం ఎక్కిందని వెల్లడించిన అధికారులు, ఆమె యూఏఈ నివాసని, కేసు నమోదు చేసుకుని, వివరాలు దుబాయ్ అధికారులకు పంపించామని తెలిపారు.
Corona Virus
Lady
Dubai
Positive
Pune

More Telugu News