Bangladesh: బంగ్లాదేశ్ లో రియల్ 'శివగాముడు'!

Real Sivagamudu in Bangladesh

  • నీటిలో మునుగుతున్న జింక పిల్లను కాపాడిన యువకుడు
  • తాజాగా వైరల్ కావడంతో నెటిజన్ల ఫ్యాక్ట్ చెక్
  • పాత చిత్రమే అయినా యువకుడిపై ప్రశంసలు

'బాహుబలి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా అరంభంలో శివగామి, తన మనవడిని నీటిలో మునగకుండా కాపాడే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే, అటువంటిదే ఒకటి బంగ్లాదేశ్ లో జరిగింది. వరద పెరిగిపోయిన వేళ, నీటిలో కొట్టుకుపోతున్న ఓ జింక పిల్లను బిలాల్ అనే యువకుడు కాపాడాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అయ్యాయి.

అయితే, కొందరు ఇది అసోంలో జరిగిన ఘటనగా పేర్కొన్నప్పటికీ, ఇది బంగ్లాదేశ్ లో తీసిన పిక్ అని, 2014లో అక్కడి నౌకాలీ జిల్లాను వరదలు ముంచెత్తినప్పుడు జరిగిన ఘటన ఇదని పలువురు నిజాన్ని వెలుగులోకి తెచ్చి కామెంట్లు పెట్టారు. అయినప్పటికీ, తాజాగా, ఈ పిక్ మరోమారు వైరల్ అయి, 'బాహుబలిని'ని గుర్తుకు తేగా, పలువురు అతని ఆనాటి సాహసాన్ని 'శివగామి'తో పోలుస్తూ, ఇతన్ని శివగాముడు అంటూ మెచ్చుకుంటున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News