America: మళ్లీ ట్రంప్ డౌటే.. అధ్యక్షుడు కావడం కష్టమంటున్న సర్వేలు

Majority Americans Choose Joe Biden in Surveys

  • కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారు
  • దేశ భద్రత, నిజాయతీ, జాతిని ఏకం చేయడంలో ట్రంప్ సూపర్
  • ట్రంప్‌కు 40, బిడెన్‌కు 55 శాతం మంది అమెరికన్ల మద్దతు

అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని పట్టుదలగా ఉన్న ట్రంప్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ప్రత్యర్థి జో బిడెన్‌ కంటే ఆయన చాలా వెనకబడి ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ నిర్వహించిన సర్వేలలో వెల్లడైంది. ట్రంప్‌తో పోలిస్తే బిడెన్‌కే ఎక్కువమంది అమెరికన్లు మద్దతు ఇస్తున్నట్టు సర్వేలో తేలింది. కరోనా కట్టడిలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని.. బిడెన్ అధ్యక్షుడై ఉంటే కరోనా విషయంలో పరిస్థితి మరోలా ఉండేదని మెజారిటీ అమెరికన్లు (54 శాతం) అభిప్రాయపడ్డారు.

ఈ నెల 12 నుంచి 15 వరకు వివిధ అంశాల వారీగా ఈ సర్వే నిర్వహించారు. ట్రంప్ పనితీరు బాగుందని 34 శాతం మంది మాత్రమే ఓటేశారు. అయితే, కీలకమైన భద్రత, జాతి వివక్ష, దేశాన్ని ఏకం చేయడం, ప్రజల సమస్యలను అర్ధం చేసుకోవడం, నిజాయతీ, నమ్మకం, వ్యక్తిగత విలువల్లో మాత్రం బిడెన్ కంటే ట్రంప్ బెటరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మొత్తంగా ట్రంప్‌కు 40 శాతం, బిడెన్‌కు 55 శాతం మంది అమెరికన్ల మద్దతు లభించింది. ఫలితంగా ట్రంప్ ఎన్నిక అసాధ్యంగానే కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి దేశంలో ఉండే పరిస్థితులు ట్రంప్ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని చెబుతున్నారు.

America
Donald Trump
Joe Biden
presidential polls
  • Loading...

More Telugu News