Odia: ఒడియా చిత్రపరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు బిజయ్ మొహంతి కన్నుమూత

Odia actor Bijay Mohanty passes away

  • గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బిజయ్
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్న సీఎం
  • ఆయన కుటుంబానికి జగన్నాథస్వామి శాంతి, సహనం, ధైర్యాన్ని ప్రసాదించాలన్న కేంద్రమంత్రి

ఒడియా చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు బిజయ్ మొహంతి (70) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిజయ్ ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందారు. ఆయన మృతికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు ఒడియా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బిజయ్ మృతితో ఒడియా చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందని సీఎం అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో బిజయ్ కుటుంబానికి శాంతి, సహనం, ధైర్యాన్ని ప్రసాదించాలని జగన్నాథస్వామిని కోరుకుంటున్నట్టు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. బిజయ్ మొహంతి భార్య తాండ్రా రే కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి కుమార్తె జాస్మిన్ ఉన్నారు.

Odia
Actor
Bijay Mohanty
Passes away
  • Loading...

More Telugu News