Kanna Lakshminarayana: రూ. 3 లక్షల కోట్ల అవినీతిపై మీరు అధికారం చేపట్టాక తీసుకున్న చర్యలేంటి?: కన్నా

Kanna Lakshminarayana fires on Vijayasai Reddy

  • కన్నా, విజయసాయి మధ్య పేలుతున్న మాటల తూటాలు
  • చంద్రబాబు మనిషి కన్నా అంటూ విజయసాయి వ్యాఖ్య
  • ఎంపరర్ ఆఫ్ కరప్షన్ లో పేర్కొన్న అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారన్న కన్నా

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. కన్నాను చంద్రబాబు వ్యక్తిగా విజయసాయి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిని ఉద్దేశించి కన్నా ట్వీట్ చేశారు. 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంలో మీరు ప్రకటించిన రూ. 3 లక్షల కోట్ల అవినీతిపై మీరు అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలేంటి?' అని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని వైసీపీ ఎంపీలు ఢిల్లీలో విడుదల చేశారు. 266 పేజీల ఈ పుస్తకంలో చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పుస్తకంలో చేసిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారని కన్నా ప్రశ్నించారు.

Kanna Lakshminarayana
Vijayasai Reddy
Chandrababu
Telugudesam
YSRCP
BJP
  • Loading...

More Telugu News