Congress: ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే ప్రమాదకర వైరస్ ఢిల్లీలో ఉంది: కపిల్ సిబల్

Kapil Sibal slams BJP over Rajasthan issue

  • బీజేపీని లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేసిన కపిల్ సిబల్
  • బీజేపీని కరోనా వైరస్‌తో పోల్చిన కాంగ్రెస్ సీనియర్ నేత
  • దాని యాంటీబాడీలు పదో షెడ్యూలును సవరించడంలో బిజీగా ఉన్నాయి

ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసే ప్రమాదకర వైరస్ ఢిల్లీలో ఉందని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. రాజస్థాన్‌లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించిన సిబల్.. బీజేపీని కరోనా వైరస్‌తో పోల్చారు.  ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే అవినీతిపూరిత విధానాల వైరస్ ఢిల్లీలో ఉందని, ఇది వుహాన్ వంటి కేంద్రం నుంచి వ్యాపించిందని, దాని యాంటీబాడీలు పదో షెడ్యూలును సవరించడంలో ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఫిరాయింపుదారులను పార్టీ పదవులను చేపట్టడం నుంచి ఐదేళ్లపాటు నిషేధించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఓ వెబినార్‌లో పాల్గొన్న సిబల్ ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు విషయాల్లో మార్పు రావాల్సి ఉందని అన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ బేరసారాలకు పాల్పడిందంటూ కాంగ్రెస్ కొన్ని ఆడియో టేపులను బయటపెట్టిన నేపథ్యంలో సిబల్ ఈ రోజు బీజేపీని లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News