Tirumala: కరోనాతో తిరుపతి స్విమ్స్‌లో మృతి చెందిన తమిళనాడు జర్నలిస్ట్

Journalist died with corona in Tirupati SWIMS

  • తిరుమలలో రిపోర్ట్‌గా పనిచేస్తున్న మణి
  • కరోనాతో స్విమ్స్‌లో చికిత్స
  • ఏపీలో ఇప్పటి వరకు ముగ్గురు జర్నలిస్టుల మృతి

కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు బలయ్యాడు.  తమిళనాడుకు చెందిన మణి అనే జర్నలిస్టు తిరుమలలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల వైరస్ బారినపడిన మణి తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా, అతడి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అతడి మృతి విషయం తెలిసిన సహచర  జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిపోర్టింగ్‌కు వెళ్లాంటే భయపడుతున్నారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు ముగ్గురు జర్నలిస్టులు కరోనాతో కన్నుమూశారు. వారిలో ఇద్దరు కడప జిల్లా వారు కాగా, తాజా తిరుపతిలో మణి మృతి చెందాడు.

Tirumala
Tirupati
Journalist
Corona Virus
  • Loading...

More Telugu News