Ram Gopal Varma: 'పవర్ స్టార్' సినిమా విడుదల తేదీ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

Varma announces Power Star movie release date
  • జూలై 25 ఉదయం 11 గంటలకు రిలీజ్
  • ఆర్జీవీ వరల్డ్ థియేటర్ డాట్ కామ్ వెబ్ సైట్లో విడుదల
  • బలహీనపడిన ఓ పవర్ ఫుల్ స్టార్ అంటూ వర్మ వ్యాఖ్యలు
ఆసక్తికర అంశాలను వెంటనే సినిమాగా రూపొందించగల దిట్ట రామ్ గోపాల్ వర్మ! కొన్నిరోజుల కిందటే 'పవర్ స్టార్' అనే సినిమా ప్రకటించిన వర్మ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. జూలై 25 ఉదయం 11 గంటలకు 'పవర్ స్టార్' మూవీ 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్ డాట్ కామ్' అనే వెబ్ సైట్లో విడుదల అవుతుందని తెలిపారు. తాను స్థాపించిన మనసేన పార్టీ ఎన్నికల్లో భయంకరమైన ఓటమి పాలవడంతో చాలా బలహీన పడిపోయిన ఓ పవర్ ఫుల్ స్టార్ అంతర్మథనంతో ఈ సినిమా మొదలవుతుందని తెలిపారు. ఈ మేరకు తన వాయిస్ తో ఓ వీడియో పోస్టు చేశారు.
Ram Gopal Varma
Power Star
Release
RGVWORLDTHEATER.COM

More Telugu News