Keeravani: ప్రభాస్ సినిమాకి మరోసారి కీరవాణి సంగీతం?

Keeravani to work for Prabhas film again

  • 'బాహుబలి' సీరీస్ కి పనిచేసిన కీరవాణి 
  • తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 
  • సంగీతానికి చిత్రంలో అధిక ప్రాధాన్యత
  • కీరవాణితో ప్రస్తుతం సంప్రదింపులు

ప్రభాస్ నటించిన 'బాహుబలి' సీరీస్ కి అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణి.. మరోసారి ఆయన చిత్రానికి మ్యూజిక్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంగీతం పరంగా కూడా చాలా ప్రాధాన్యత వుందట. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే బాహుబలి చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న కీరవాణిని తీసుకుంటే చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

ఈ క్రమంలో తాజాగా కీరవాణితో ఈ విషయంలో సంప్రదింపులు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఆయన కూడా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు, దాంతో సానుకూలంగా స్పందిస్తున్నట్టు చెబుతున్నారు. మరోపక్క, ఈ చిత్రంలో నటించే కథానాయిక విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనేను ఫిక్స్ చేసుకుందామని అనుకున్నప్పటికీ, ఆమె భారీ స్థాయిలో పారితోషికం అడగడంతో, ప్రస్తుతం కియరా అద్వానీ పట్ల దర్శక నిర్మాతలు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News