MS Dhoni: ఎంఎస్ ధోనీ లుక్ చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!

MS Dhoni New Look Goes Viral

  • వీడియోను షేర్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
  • మరింత యువకుడిగా కనిపిస్తున్న ధోనీ
  • తమ స్టార్ క్రికెటర్ వచ్చేశాడంటున్న ఫ్యాన్స్

తన ఆటతో కోట్లాది మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, సాధారణంగా సోషల్ మీడియాకు కాస్తంత దూరంగా ఉంటాడు. దేశమంతా లాక్ డౌన్ అమలవుతూ, ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమైన వేళ, గత నాలుగైదు నెలలుగా, అప్పుడప్పుడూ ఫ్యాన్స్ ను పలకరిస్తున్న ధోనీ, తాజాగా, ఓ వీడియోలో కనిపించి అభిమానులను ఆశ్చర్య పరిచాడు. శుక్రవారం నాడు ధోనీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది. దీంతో ఇది వైరల్ అయింది.

ఈ లుక్ లో ధోనీ తన వయసును కాస్తంత తగ్గించుకున్నట్టు కనిపించాడు. ఎవరితోనో వీడియో కాల్ లో హాయ్ చెబుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ వీడియోను, ధోనీ రూపాన్ని చూసిన ఫ్యాన్స్, తమ స్టార్ ఆటగాడు తిరిగి గ్రౌండ్ లోకి దిగేందుకు సిద్ధమైపోయాడని కామెంట్లు పెడుతున్నారు. కాగా, గత సంవత్సరం జూలై తరువాత ధోనీ ఇంతవరకూ బ్యాట్ ను పట్టుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఐపీఎల్ జరిగితే, ధోనీని క్రికెట్ మైదానంలో తిరిగి చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News