Devineni Uma: భూముల కొనుగోళ్లలో వందల కోట్ల రూపాయల దోపిడీ: దేవినేని ఉమ

devineni fires on ycp

  • సెంటుపట్టా పేరుతో కోట్లు కూడపెడుతున్నారు
  • రూ.12 లక్షల భూమికి రూ.55 లక్షలు 
  • కుదరదంటే ఏ స్థాయి అధికారికైనా బెదిరింపులు, బదిలీలు
  • రైతుల వద్ద నుండీ కమీషన్ల వసూళ్లు

నెల్లూరు కలెక్టర్‌ బదిలీ వెనుక కొత్త కోణం బయటపడిందంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ వైసీపీ నేతలపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.

'సెంటుపట్టా పేరుతో మీ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు కూడపెడుతున్నారు. రూ.12 లక్షల భూమికి రూ.55 లక్షలు.. కుదరదంటే ఏ స్థాయి అధికారికైనా బెదిరింపులు, బదిలీలు. రైతుల వద్ద నుండీ కమీషన్ల వసూళ్లు. భూముల కొనుగోలు, మెరకల్లో వందల కోట్ల రూపాయల దోపిడీ, అవినీతిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గారు?' అని దేవినేని ప్రశ్నించారు.

కాగా, నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరి బాబు బదిలీ వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని, మొదట సెలవుపై వెళ్లిన శేషగిరి బాబు, ఐదు రోజులకే అర్ధరాత్రి బదిలీ అయినట్లు తెలిసిందని ఆ పత్రికలో పేర్కొన్నారు. ఇందుకు కావలి భూ తతంగమే కారణమై ఉంటుందని తెలిపారు.  

రూ.12 లక్షల భూమికి రూ.55 లక్షలు ఫిక్స్‌ చేసి, పేదలకు ఇళ్ల పేరుతో పెద్దలు కోట్ల రూపాయలు కూడబెట్టుకునేందుకు ప్రణాళిక వేసుకున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో అవకతవకలున్నాయని కలెక్టర్ గుర్తించి, సంతకం చేస్తే ఇరుక్కుపోతామని ఆందోళన చెందారని, ఆయనను పిలిపించి వైసీపీ నేతలు హెచ్చరించారని, ఈ కారణాలతోనే కలెక్టర్‌ బదిలీ అయ్యారని ఆ కథనంలో పేర్కొన్నారు.

Devineni Uma
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News