COVID-19: ఏపీలో రికార్డుస్థాయిలో పెరుగుతున్న కొవిడ్ మరణాలు.. 35 వేలు దాటేసిన కేసులు

AP Crosses 35 thousand Corona Cases

  • గత 24 గంటల్లో 44 మంది మృత్యువాత
  •  అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలలో 9 మంది చొప్పున మృతి
  • కొవిడ్ బారిన కొత్తగా 2,432 మంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు భయపెడుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 44 మంది మృత్యువాత పడగా, 2,432 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 35,451కి పెరగ్గా, 452 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 22,197 నమూనాలు పరీక్షించగా, 2,412 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 20 మంది మహమ్మారి బారినపడ్డారు.

తాజా మరణాల్లో అత్యధిక శాతం అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలలో వెలుగుచూశాయి. ఈ జిల్లాల్లో 9 మంది చొప్పున కొవిడ్‌కు బలయ్యారు. కర్నూలులో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఇద్దరు చొప్పున మరణించగా, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్కొక్కరు మృతి చెందారు.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా  ఇప్పటి వరకు 12,17,963 శాంపిళ్లు పరీక్షించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇంకా 16,621 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 18,378 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

COVID-19
Andhra Pradesh
Corona Virus
Covid deaths
  • Loading...

More Telugu News