Chandrababu: విశాఖ సాల్వెంట్స్ మృతుడి కుటుంబానికి కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు డిమాండ్

Chandrababu Once again fires on Jagan
  • ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో ఇచ్చిన పరిహారాన్నే వీరికీ ఇవ్వాలి
  • ప్రమాద కారకులను వెంటనే అరెస్ట్ చేయాలి
  • జగన్ బాధ్యతా రాహిత్యం వల్లనే వరుస ప్రమాదాలు
విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జూనియర్ ఆపరేటర్ కాండ్రేగుల శ్రీనివాసరావు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇచ్చిన ప్యాకేజీనే సాల్వెంట్ ప్రమాద బాధితులకూ ఇవ్వాలని కోరారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయాలన్న చంద్రబాబు.. వారిని వదిలేసి పరామర్శకు వెళ్లిన నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జగన్ బాధ్యతారాహిత్యం వల్లనే విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు.
Chandrababu
Jagan
Visakhapatnam District
Visakha salvents

More Telugu News