Vivek Oberoy: చిరంజీవి సినిమాలో ఆఫర్ ను తిరస్కరించిన వివేక్ ఒబెరాయ్

Vivek Oberoi rejects Offer in Chiranjeevi movie

  • చిరంజీవి హీరోగా 'లూసిఫర్ ' చిత్రం రీమేక్
  • దర్శకత్వం వహిస్తున్న సుజిత్
  • విలన్ పాత్ర కోసం వివేక్ ను సంప్రదించిన వైనం

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు ఉత్తరాదిలోనే కాక దక్షిణాదిలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన వివేక్ మన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తాజాగా ఆయనకు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్ లో వైరల్ అవుతోంది. మలయాళంలో 'లూసిఫర్' చిత్రం సూపర్ హిట్టైంది. ఈ చిత్రాన్ని చిరంజీవి హీరోగా రీమేక్ చేయబోతున్నారు. ప్రభాస్ తో 'సాహో'ను తెరకెక్కించిన సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించగా... ఆయన తిరస్కరించారట.

'లూసిఫర్' చిత్రంలో విలన్ పాత్రను వివేక్ పోషించడం గమనార్హం. వివేక్ నో చెప్పడంతో ఆయన స్థానంలో రహమాన్ ను తీసుకున్నారట. చిరంజీవి మరో చిత్రం  'ఖైదీ నంబర్ 150'లో కూడా విలన్ పాత్రను వివేక్ తిరస్కరించారు.

Vivek Oberoy
Bollywood
Tollywood
Lucifer
Chiranjeevi
  • Loading...

More Telugu News