USA: యూఎస్ లో గత 17 ఏళ్లలో తొలిసారి... మరణదండన వాయిదా!

After 17 Years US Postponed a Death Sentence

  • ముగ్గురిని హత్య చేసిన డానియల్ లీ
  • నేడు విషపు ఇంజక్షన్ ఇచ్చి శిక్ష అమలు
  • కరోనా కారణంగా రాలేమన్న బంధువులు
  • శిక్ష అమలును వాయిదా వేసిన కోర్టు

అమెరికాలో దాదాపు 17 సంవత్సరాల తరువాత, నిర్ణయించిన తేదీకి మరణశిక్ష అమలు కాకపోవడం అన్నది నేడు చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే, 1996లో తుపాకుల వ్యాపారి విలియం ముల్లెర్, అతని భార్య నాన్సీ, 8 సంవత్సరాల కుమారుడు పొవెల్ లను దారుణంగా చంపిన ఘటనలో ఓక్లహామాలోని యూకాన్ ప్రాంతానికి చెందిన డానియల్ లీ దోషిగా తేలడంతో కోర్టు అతనికి మరణదండన విధించింది.

ఆపై నేడు డానియల్ లీకి విషపు ఇంజక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూఎస్ చట్టాల ప్రకారం, విషపు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో దోషి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవాలి. ప్రస్తుతం కరోనా విస్తరిస్తుండటంతో, శిక్ష అమలు జరిగే ప్రాంతానికి తాము రాలేమని ఫెడరల్ కోర్టుకు లీ బంధువులు స్పష్టం చేయగా, మరణ శిక్షను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరికొంతకాలం పాటు లీ జీవించే వీలు ఏర్పడింది.

USA
Federal Court
Death Sentence
Cancelled
  • Loading...

More Telugu News