Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అరవింద్ పై కోడిగుడ్లతో దాడిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు

TRS cadre attacks on BJP MP Arvind

  • సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎంపీ అరవింద్
  • బీజేపీ ఆఫీసును ముట్టడించిన టీఆర్ఎస్ శ్రేణులు
  • పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు

సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. వరంగల్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహాన్ని కలిగించాయి. అరవింద్ కారుపై కోడిగుడ్లతో దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అంతకుముందు ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతికి అప్పగించాడంటూ పరోక్షంగా ఎంఐఎం నేతలపై వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదీద్దున్ ఒవైసీని జిన్నాతో పోల్చడమేంటని నిలదీశారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి కేసీఆర్ పెద్ద కొడుకు ఒవైసీ అని పేర్కొన్నారు. స్థానిక టీఆర్ఎస్ నేతలు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ అరవింద్ మండిపడ్డారు.

Dharmapuri Arvind
TRS
Attack
Warangal
KCR
  • Loading...

More Telugu News