బాలీవుడ్ నటులను వణికిస్తోన్న కరోనా.. అనుపమ్ ఖేర్ ఇంట్లో నలుగురికి సోకిన వైనం
- ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన అనుపమ్ ఖేర్
- తల్లి, సోదరుడు రాజు ఖేర్, మరదలు, మేనకోడలికి కరోనా
- తనకు నెగెటివ్ వచ్చిందన్న అనుపమ్
ఆమెలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయని అనుపమ్ ఖేర్ చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ముంబైలో కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అనంతరం తన సోదరుడు రాజు ఖేర్, మరదలు, మేనకోడలుకి కూడా కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
బీఎంసీ అధికారులతో పాటు వైద్యులు తమకు సహకరించారని అనుపమ్ ఖేర్ తెలిపారు. తాను కూడా కరోనా పరీక్ష చేయించుకున్నానని, నెగెటివ్ అని తేలిందని వివరించారు. ప్రస్తుతం తాము హోం క్వారంటైన్‌లో ఉన్నామని, తన సోదరుడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నారని ఆయన వివరించారు.