Vikas Dubey: వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై భార్య రిచా వ్యాఖ్యలు

Vikas Dubey wife Richa justifies her husband encounter

  • తన భర్త తప్పు చేశాడన్న రిచా
  • ఈ శిక్ష సరైనదేనని వెల్లడి
  • తమ మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న తండ్రి

ఘరానా నేరస్తుడు వికాస్ దూబేను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపడంపై కుటుంబ సభ్యులు స్పందించారు. వికాస్ దూబే భార్య రిచా మాట్లాడుతూ, ఎన్ కౌంటర్ చేయడం సబబేనని పేర్కొన్నారు. తన భర్త ఘోరానికి పాల్పడ్డాడని, ఇలాంటి శిక్షకు అర్హుడేనని చెబుతూ బోరున విలపించారు. పటిష్ట బందోబస్తు మధ్య వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో నిర్వహించగా, భార్య, చిన్న కుమారుడు, బావమరిది దినేశ్ తివారీ తప్ప ఇతర కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.

తండ్రి రామ్ కుమార్ దూబే సైతం కుమారుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిరాకరించారు. ఎన్ కౌంటర్ పై ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు ఎనిమిది మంది పోలీసులను చంపాడని, తద్వారా క్షమించరాని నేరం చేశాడని వ్యాఖ్యానించారు. తమ మాట ఎప్పుడూ వినలేదని, పెద్దల మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్పష్టం చేశారు. మొదటి నుంచి వికాస్ దూబే కారణంగా తమ పూర్వీకుల ఆస్తి మొత్తం హరించుకుపోయిందని, ఈ శిక్ష సరైనదేనని అన్నారు. నేర ప్రవృత్తిని ఎంచుకున్నవాళ్లకు ఈ ఎన్ కౌంటర్ ఓ కనువిప్పు కావాలని రామ్ కుమార్ దూబే ఆకాంక్షించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News