Subramanian Swamy: వీళ్లేమన్నా చట్టానికి అతీతులా?... బాలీవుడ్ 'ఖాన్' త్రయంపై ధ్వజమెత్తిన సుబ్రహ్మణ్యస్వామి
- సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో బీజేపీ నేత వ్యాఖ్యలు
- ఖాన్ లకు దుబాయ్ లో ఉన్న ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్
- వారికి ఆస్తులు బహూకరించిందెవరో నిగ్గు తేల్చాలంటూ ట్వీట్
ఆత్మహత్య అని చెబుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉదంతం తర్వాత బాలీవుడ్ 'ఖాన్' త్రయం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మౌనం దాల్చిందా? అంటూ బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ లో ప్రశ్నించారు. "ఈ ముగ్గురు జగజ్జెంత్రీలు భారత్ లోనూ, విదేశాల్లోనూ వెనుకేసుకున్న ఆస్తులపై విచారణ జరపాలి. ముఖ్యంగా, వారికి దుబాయ్ లో ఉన్న ఆస్తులపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ వారికి బంగ్లాలు, స్థిరాస్తులు ఎవరు బహూకరించారో, ఎలా కొన్నారో తేలాలి. దీనివెనుక ఉన్న వ్యవస్థ ఏమిటో సిట్, ఈడీ, ఐటీ, సీబీఐ విచారణ జరిపి నిగ్గు తేల్చాలి. వారేమన్నా చట్టానికి అతీతులా?" అంటూ నిలదీశారు.