Vikas Dubey: వికాస్ దూబే మృతదేహానికి పోస్టుమార్టం... కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు

Corona tests conducted for Vikas Dubey dead body
  • ఎన్ కౌంటర్ లో వికాస్ దూబే హతం
  • దూబేకు కరోనా నెగెటివ్
  • దూబే శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు
నిన్న ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో పోలీసులకు పట్టుబడిన కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే ఈ ఉదయం ఎన్ కౌంటర్ లో హతుడైన సంగతి తెలిసిందే. ఉజ్జయిని నుంచి కాన్పూర్ కు తరలిస్తుండగా, పోలీసులపై దాడికి యత్నించిన దూబేను కాల్చి చంపారు. కాగా, కాన్పూర్ ఆసుపత్రిలో ఈ గ్యాంగ్ స్టర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియను వీడియోలో బంధించారు. అతడి మృతదేహంలో నాలుగు బుల్లెట్ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దూబే మృతదేహానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, అతడికి కరోనా సోకలేదని తేలింది.

Vikas Dubey
Corona Virus
Encounter
Gangster
Kanpoor
Uttar Pradesh

More Telugu News