Seoul: లైంగిక వేధింపుల విషయం బయటకు రాగానే... సియోల్ మేయర్ ఆత్మహత్య!

Seoul Mayer Sucide

  • ఇటీవలే లైంగిక వేధింపుల కేసు
  • నిన్న ఇంటి నుంచి అదృశ్యమైన పార్క్ వోన్
  • ఈ ఉదయం విగతజీవిగా గుర్తింపు

సియోల్ మేయర్, సౌత్ కొరియా అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారని భావించిన పార్క్ వోన్-సూన్ (64) అనూహ్య పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు వెల్లడించిన పోలీసులు, ఇటీవలే అతనిపై సియోల్ సిటీ ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపుల కేసు పెట్టారని, ఈ కేసు విచారణ దశలో ఉందని తెలిపారు. కేసు విషయం తెలియగానే నిన్న మధ్యాహ్నం నుంచి పార్క్ వోన్ -సూన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, వందలాది మంది అధికారులు ఆయన కోసం సెర్చ్ చేస్తుండగా, విగత జీవుడిగా కనిపించారని వెల్లడించారు.

తన తండ్రి కనిపించడం లేదని పార్క్ కుమార్తె గురువారం నాడు పోలీసులను ఆశ్రయించగా, అప్పటి నుంచి ఆయన్ను వెతికారు. ఇంటి నుంచి వెళ్లిన తరువాత, ఆయన తనకు ఫోన్ చేశారని, అవే ఆయన చివరి మాటలుగా తనకు అనిపించిందని, ఆపై తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. కాగా, దక్షిణ కొరియా డెమొక్రటిక్ పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న పార్క్ వోన్ - సూన్, దాదాపు దశాబ్దకాలం పాటు సియోల్ ప్రజా ప్రతినిధిగా కొనసాగారు.

Seoul
Mayor
Sucide
Harrasment
  • Loading...

More Telugu News