Budda Venkanna: విజయసాయి 'ట్రయిలర్, సినిమా, జైలు' వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న సెటైర్!

Buddha Venkanna Setires on Vijayasai Reddy
  • ట్రయిలర్ ను చూసే ఎంపీలు పార్టీని వీడుతున్నారు
  • మంత్రులు అసంతృప్తిగా ఉన్నారు
  • మామా, అల్లుళ్లకు చిప్పకూడు ఖాయం
ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ పై తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ట్రయిలర్ ను చూసే ఎంపీలు పార్టీని వీడుతున్నారని, మంత్రులు అసంతృప్తిగా ఉంటే, ఎమ్మెల్యేలు నిరసనలకు దిగుతున్నారని అన్నారు. "వైఎస్ జగన్ గారి ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్నారు మామ విజయసాయి రెడ్డి. నిజమే ట్రైలర్ కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేలు ధర్నాలు, నిరసనలు.ఇక అసలు బొమ్మ పడితే వైకాపా ఖాళీ. మామా, అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్పకూడు ఖాయం" అని విమర్శించారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Twitter

More Telugu News