Susheel Gowda: కన్నడ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య

Kannada actor Susheel Gowda suicide

  • బుల్లి తెరపై సక్సెస్ అయిన సుశీల్
  • దునియా విజయ్ సినిమాతో చిత్రసీమలోకి అడుగు
  • సినిమా విడుదల కాకముందే ఆత్మహత్య

కన్నడ బుల్లితెర నటుడిగా పేరుప్రఖ్యాతులను తెచ్చుకున్న సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్వస్థలం మండ్యలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సుశీల్ వయసు 30 ఏళ్లు. బుల్లితెరపై సక్సెస్ ఫుల్ నటుడిగా పేరుతెచ్చుకున్న సుశీల్... సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా హీరో దునియా విజయ్ నటించిన చిత్రంలో పోలీసు పాత్రలో నటించాడు. అయితే, ఆ చిత్రం ఇంకా విడుదల కాకముందే ఆత్మహత్యకు పాల్పడటం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది.

మరోవైపు సుశీల్ ఆత్మహత్యపై దునియా విజయ్ స్పందించాడు. సుశీల్ ను తొలిసారి చూసినప్పుడు హీరో కావాల్సిన వ్యక్తి అని అనుకున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటాడని భావించానని, కానీ అందరినీ వదిలి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య దేనికీ సమాధానం కాదని చెప్పాడు. కరోనా భయం వల్లే కాక.. జీవించడానికి డబ్బు దొరకదనే నమ్మకాన్ని కోల్పోవడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోందని అన్నాడు. కష్ట సమయంలో అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పాడు.

Susheel Gowda
Kannada
Actor
Suicide
  • Loading...

More Telugu News