Sanjaydath: బాలకృష్ణకు ప్రధాన విలన్ గా సంజయ్ దత్?

Sanjaydath to play villan to Balakrishna
  • హీరోల ఇమేజ్ కు తగ్గా విలన్లు అవసరం 
  • బోయపాటి సినిమాలలో విలనిజానికి ప్రాధాన్యత
  • బాలకృష్ణ, బోయపాటి సినిమాలో ఇద్దరు విలన్లు 
  • సానుకూలంగా స్పందించిన సంజయ్ దత్
మన స్టార్ హీరోలకు వారి ఇమేజ్ కు తగ్గా ఇమేజ్ వున్న విలన్ నటులే అవసరం అవుతారు. ఫిజిక్ విషయంలో కానీ, స్టేచర్ విషయంలో కానీ సమ ఉజ్జీ కాకపోతే హీరోయిజం ముందు విలనిజం తేలిపోతుంది. దాంతో సినిమా తేడా కొట్టేస్తుంది. అందుకే, మన హీరోలకు విలన్ ల ఎంపిక కూడా చాలా ప్రధానం. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం విషయంలో కూడా అదే జరుగుతోంది.

మామూలుగానే బోయపాటి సినిమాలలో యాక్షన్ పాలు కాస్త ఎక్కువ వుంటుంది. దానికి తోడు విలనిజం కూడా కొత్త తరహాలో సాగుతుంది. అందుకే, ఆయా విలన్ల పాత్రలకు ఆయన సమ ఉజ్జీల లాంటి నటులను ఎంపిక చేస్తుంటారు. ఇప్పుడీ చిత్రంలో ఇద్దరు విలన్లు ఉండడంతో ఓ పాత్రకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సంజయ్ తో మాట్లాడడం కూడా జరిగిందనీ, ఆయన సానుకూలంగా స్పందించాడనీ అంటున్నారు.  
Sanjaydath
Balakrishna
Boyapati Sreenu

More Telugu News