Dil Bechara: ప్రభాస్ 'సాహో' రికార్డు దాటేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం ట్రైలర్

Sushant movie Dil Bechara trailer breaks records

  • సాహో ట్రైలర్ కు 31 మిలియన్ వ్యూస్
  • 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించిన దిల్ బేచారా
  • 6.4 మిలియన్ లైకులతో సరికొత్త రికార్డు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లినా, తాను నటించిన చిత్రాల ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా త్వరలోనే ఓటీటీ వేదికపై రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ముందుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అభిమానులను విశేషంగా ఆకర్షించిన ఈ ట్రైలర్ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. యూట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ తో సందడి చేస్తోంది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ట్రైలర్ 31 మిలియన్ల వ్యూస్ సాధించగా, దిల్ బేచారా ఇప్పుడా రికార్డును అధిగమించింది.

అంతేకాదు, 6.4 మిలియన్ల లైకులు సంపాదించింది. ఇప్పటివరకు అత్యధిక లైకుల  రికార్డు హాలీవుడ్ సినిమా అవెంజర్స్: ఎండ్ గేమ్ పేరిట ఉంది. అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం ఇప్పటివరకు 2.9 మిలియన్ లైకులు పొందింది. ఇప్పుడా రికార్డు సుశాంత్ సినిమా పరమైంది. ఇక, 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డు షారుఖ్ ఖాన్ నటించిన జీరో చిత్రం పేరిట ఉంది. జీరో సినిమా ట్రైలర్ కు ఒక్కరోజు వ్యవధిలో 50 మిలియన్ల వ్యూస్ లభించాయి.

Dil Bechara
Trailer
Record
Sushant Singh Rajput
Bollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News