Jagan: ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్

CM Jagan leaves Tadepalli for Idupulapaya visit

  • రేపు వైఎస్సార్ జయంతి
  • ఇడుపులపాయలో వేడుకలు
  • పాల్గొననున్న సీఎం

రేపు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నిర్వహించే కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరవనున్నారు. అందుకోసం ఆయన ఈ సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయ బయల్దేరారు. ఈ రాత్రికి సీఎం జగన్ అక్కడే బస చేస్తారు. రేపు ఇక్కడ జరిగే వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. రేపు మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. రేపు సాయంత్రం విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేస్తారు.

Jagan
Idupulapaya
YSR
Andhra Pradesh
  • Loading...

More Telugu News