ChAdOx1 nCoV-19: ఆఖరి దశకు చేరుకున్న ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్... అక్టోబరు నాటికి సిద్ధం!

Oxford vaccine for corona enters into last stage

  • ఆస్ట్రాజెనెకాతో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ సంయుక్త కృషి
  • అనేక దేశాల్లో వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగం
  • 3 కోట్ల డోసుల్ని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఈ వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం ఆఖరి అంకంలోకి ప్రవేశించింది. ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు ChAdOx1 nCoV-19 పేరిట రూపొందిస్తున్న వ్యాక్సిన్ చింపాంజీలపై సత్ఫలితాలను ఇచ్చింది. దాంతో ఇప్పుడు మానవులపై ప్రయోగాలు చేస్తున్నారు. బ్రెజిల్ లోని కొందరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలిస్తున్నారు. కరోనా నుంచి ఈ వ్యాక్సిన్ మానవులకు ఎంతవరకు రక్షణ ఇస్తుందో ఈ ఆఖరి దశ ప్రయోగాల ద్వారా గుర్తించనున్నారు.

ఇప్పటికే దక్షిణాఫ్రికాలో 2 వేల మందికి ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఇచ్చారు. బ్రిటన్ లోనూ 4 వేల మంది వలంటీర్లు ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయోగాలు కచ్చితంగా విజయవంతం అవుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా సంస్థ అక్టోబరు నాటికి వ్యాక్సిన్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 3 కోట్ల డోసులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది.

  • Loading...

More Telugu News