Roja: 108 వాహనాన్ని స్వయంగా నడిపిన రోజా.... వీడియో ఇదిగో!

MLA Roja drives new ambulance

  • ఇటీవలే కొత్త అంబులెన్స్ లు ప్రారంభించిన సీఎం జగన్
  • నగరి నియోజకవర్గంలో వాహనాలకు పచ్చజెండా ఊపిన రోజా
  • చంద్రబాబుపైనా, టీడీపీపైనా విమర్శలు 

ఏపీ సీఎం జగన్ ఇటీవలే ఆధునిక సౌకర్యాలతో కూడిన 108, 104 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ వాహనాలన్నీ జిల్లాలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గంలో  108, 104 వాహనాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ 108 అంబులెన్స్ ను రోజా స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆమె ట్రాఫిక్ లో సైతం అలవోకగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, చంద్రబాబుపైనా, టీడీపీపైనా ధ్వజమెత్తారు. మంచి పనులు చేస్తూ సీఎం జగన్ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంటుంటే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు తిన్నది అరక్క ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Roja
108
Ambulance
Nagari
Jagan
Chandrababu
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News