Coronavirus App: ఈ యాప్‌లో మీ వివరాలు తెలిపి, ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోండి: ఏపీ ప్రభుత్వం

govt about corona tests in ap

  • కొవిడ్‌-19 ఏపీ యాప్‌ వినియోగిస్తోన్న ఏపీ సర్కారు
  • కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకుంటోన్న వారికి సౌకర్యం
  • ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలను అత్యధిక సంఖ్యలో నిర్వహిస్తోన్న సీఎం జగన్‌ సర్కారు ఇందుకోసం కొవిడ్‌-19 ఏపీ యాప్‌ను వినియోగిస్తోంది. కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకుంటోన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ల్యాబులకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ఈ యాప్‌ను వాడుతోంది.  

                        
ఈ వివరాలను తెలుపుతూ... 'మీకు కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నట్లయితే  కొవిడ్‌-19 ఏపీ యాప్ లో మీ వివరాలు పొందుపరిచి వెంటనే కరోనా పరీక్ష కోసం కోరండి. అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కొవిడ్ పరీక్ష పూర్తిగా ఉచితం' అని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

Coronavirus App
Corona Virus
COVID-19
Andhra Pradesh
  • Loading...

More Telugu News