Vishal: హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్... అంటున్న మాజీ ఉద్యోగి రమ్య!

Ramya Sensational Comments on Tamil Hero Vishal

  • తన వద్ద పనిచేసిన మహిళపై విశాల్ ఫిర్యాదు
  • రూ.45 లక్షలు కాజేసిందంటూ కేసు
  • సంచలన ఆరోపణలు చేసిన రమ్య

తమిళ స్టార్ హీరో విశాల్, గత వారంలో తన ప్రొడక్షన్ హౌస్ లో ఆరేళ్లుగా పనిచేసిన రమ్య అనే మహిళ, దాదాపు రూ. 45 లక్షలు కాజేసిందని పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హీరోగానే కాకుండా, నిర్మాతగానూ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాలు తీస్తున్న ఆయన, హరి, రమ్య అనే ఇద్దరిని ఉద్యోగులుగా నియమించుకోగా, ఇరువురూ కలిసి ఆరేళ్ల వ్యవధిలో లక్షల డబ్బు కొట్టేశారన్నది విశాల్ అభియోగం.

అయితే, తనపై వచ్చిన ఆరోపణలపై రమ్య ఘాటుగా స్పందించింది. పైకి హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్ అని, అందుకు సంబంధించిన ఎన్నో ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, తన వద్ద ఉన్న వివరాలన్నీ చెబితే, విశాల్ నిజస్వరూపం బయట పడుతుందని హెచ్చరించింది. తాను ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, మహిళను కావడం వల్లే బెదిరిస్తున్నారని వాపోయింది.

తాను ఇంతకాలమూ ఎంతో సైలెంట్ గా ఉన్నానని, ఇప్పుడు తనపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని, దాంతో విశాల్ విషయం అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించింది. కాగా, తమిళ చిత్రపరిశ్రమలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గత కొంతకాలంగా విశాల్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. చిత్ర పరిశ్రమ ఎన్నికల నుంచి ఆయనపై తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇక, తాజాగా, రమ్య  చేసిన ఆరోపణలపై విశాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Vishal
Ramya
Kollywood
Allegations
  • Loading...

More Telugu News