Galwan Valley: గాల్వాన్ లోయ ఘర్షణలలో 100 మందికి పైగా చైనా సైనికుల మరణం... వెల్లడించిన చైనా మాజీ సైనికుడు.. ప్రత్యేక కథనం వీడియో!

More than 100 China Army People Killed in Galwan

  • గత నెలలో సరిహద్దుల్లో ఘర్షణ
  • అమరులైన 21 మంది భారత జవాన్లు
  • చైనాలో కలకలం రేపుతున్న మాజీ సైనికుడి వ్యాఖ్యలు

గత నెలలో భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనాకు చెందిన 40 నుంచి 45 మంది వరకూ చనిపోయి వుండవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా ఈ ఘర్షణలో చనిపోయారని ఆ దేశానికి చెందిన పీపుల్స్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని కూడా ఆరోపించారు. గాల్వాన్ వ్యాలీలో అసలు ఏం జరిగిందన్నది చైనా తరఫు నుంచి ఎన్నడూ బయటకు రాదని ఆయన అన్నారు.

భారత భూభాగంలోకి  చైనా సైన్యం వెళ్లిన తరువాత పెద్ద యుద్ధమే జరిగిందని, 100 మందికి పైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన సీపీఏ మాజీ సైనికుడు క్సీ, ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు ఇండియాకే అనుకూలమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చైనాలో చర్చనీయాంశమయ్యాయి. 

  • Loading...

More Telugu News