Police: ఏపీ పోలీసుల్లో కరోనా కలకలం... 466 మందికి పాజిటివ్

Corona spreads in AP Police staff

  • పోలీసుల్లో పెరుగుతున్న కరోనా కేసులు
  • విశాఖలో 13 మంది పోలీసులకు కరోనా
  • 55 ఏళ్లు పైబడినవారికి సాధారణ విధులు

ఏపీ పోలీసుల్లోనూ కరోనా వ్యాప్తి మరింత పెరిగింది. ఇప్పటివరకు 466 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో తక్కువ కేసులు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటోందని స్పష్టం చేశారు. విశాఖలో 13 మంది పోలీసులకు కరోనా వచ్చిందని తెలిపారు. కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, 55 ఏళ్లు పైబడిన వారికి సాధారణ విధులు కేటాయిస్తున్నామని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని కరోనా విధులకు పంపడం లేదని స్పష్టం చేశారు.

Police
Corona Virus
Positive
Andhra Pradesh
DGP
Gautam Sawang
  • Loading...

More Telugu News