Narendra Modi: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ... చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ!

PM Modi meets President at Rashtrapathi Bhavan
  • రాష్ట్రపతిభవన్ కు వెళ్లిన ప్రధాని మోదీ
  • జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ
  • సమావేశంపై ట్వీట్ చేసిన రాష్ట్రపతి
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి దేశ ప్రథమపౌరుడు రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సమావేశం గంటకు పైగా సాగింది. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆయనతో చర్చించారు. జాతీయస్థాయి కీలక అంశాలను కూడా మోదీ రాష్ట్రపతికి వివరించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అటు, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపైనా రామ్ నాథ్ కోవింద్ కు వివరించినట్టు సమాచారం. కాగా, ఈ భేటీపై రాష్ట్రపతి ట్వీట్ చేశారు. జాతీయ, అంతర్జాతీయపరంగా ప్రాధాన్యత ఉన్న అంశాలపై చర్చించినట్టు తెలిపారు.
Narendra Modi
President Of India
Ram Nath Kovind
China
India

More Telugu News