Mumbai: ముంబయిలో భారీ వర్షపాతం... రాగల 24 గంటల్లో కుంభవృష్టి!

Heavy rains lashes Mumbai city

  • గత రెండ్రోజులుగా ముంబయిలో భారీ వర్షపాతం
  • నీట మునిగిన పలు ప్రాంతాలు
  • కరోనాకు తోడు వర్షాలతో ముంబయి అతలాకుతలం

నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ముంబయిని, కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. చెంబూర్, సెంట్రల్ ముంబయి నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొలాబా అబ్జర్వేటరీ, శాంతాక్రజ్ ప్రాంతాల్లో గడచిన 24 గంటల వ్యవధిలో కుండపోత వానలు కురిశాయి. రాగల 24 గంటల్లో ముంబయిలో కుంభవృష్టి తప్పదని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) చెబుతోంది.

Mumbai
Heavy Rains
Rainfall
IMD
Weather
  • Loading...

More Telugu News