Suraj Pancholi: దిశ నన్ను ఎప్పుడూ కలవలేదు.. సుశాంత్ తో నాకు గొడవ జరిగిందనే వార్తలో నిజం లేదు: సూరజ్ పంచోలీ

I never met Disha says Suraj Pancholi

  • సూరజ్ కారణంగా దిశ గర్భవతి అయిందని వార్త
  • దిశ, సుశాంత్ ఇద్దరినీ సూరజ్ చంపేశాడని కథనం
  • ఇదంతా కట్టుకథ అని చెప్పిన సూరజ్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడటానికి కొన్ని రోజుల ముందే ఆయన మేనేజర్ దిశ ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో హీరో సూరజ్ పంచోలిపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.

సూరజ్ కారణంగా దిశ గర్భవతి అయిందని... ఆ విషయం సుశాంత్ కు తెలిసిందని... అందుకే ఆమెను, సుశాంత్ ను ఇద్దరినీ సూరజ్ చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించాడనే వార్త ప్రచారమవుతోంది. ఈ అంశానికి సంబంధించి జాతీయ మీడియాతో సూరజ్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.

తనకు సంబంధం లేని విషయంలోకి తనను లాగారని సూరజ్ అన్నాడు. దిశ అనే అమ్మాయిని తాను ఒక్కసారి కూడా కలవలేదని చెప్పాడు. 2017లో సుశాంత్ తో తాను గొడవ పడినట్టు కూడా ప్రచారం చేస్తున్నారని.. ఇందులో కూడా నిజం లేదని అన్నాడు. తన జీవితంలోకి ప్రతిసారి సల్మాన్ ఖాన్ ను కూడా లాగుతున్నారని.. ఆయనకు వేరే పనులు ఉండవా? అని ప్రశ్నించారు.

ఈ కట్టుకథను ఎవరో ఒక వ్యక్తి సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చెప్పారు. ఇలాంటి కట్టు కథలు సోషల్ మీడయాలో బాగా వైరల్ అవుతాయని తెలిపాడు. వాస్తవాలు తెలియని వారు ఇలాంటి కట్టు కథలను నమ్మేస్తుంటారని చెప్పాడు.

Suraj Pancholi
Sushant Singh Rajput
Disha
Bollywood
  • Loading...

More Telugu News