Kollu Ravindra: కొల్లు రవీంద్రకు జ్యుడీషియల్ రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

Police has taken Kollu Ravindra to Rajamandri jail

  • మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్రపై ఎఫ్ఐఆర్
  • నిన్న సాయంత్రం కొల్లు రవీంద్ర అరెస్ట్
  • కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్

మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో అరెస్టయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించారు. మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్ర పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చడం తెలిసిందే.

అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు నిన్న సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. ఈ క్రమంలో ఆయనను రెండో అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హజరు పరిచారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్రకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Kollu Ravindra
Jail
Rajamandri
Moka Bhaskar Rao
Police
  • Loading...

More Telugu News