IT Returns: ఐటీ రిటర్న్స్ గడువును మరింత పొడిగించిన ఆదాయపు పన్నుశాఖ

Filing of ITR extended till November 30

  • నవంబర్ 30 వరకు గడువు పెంపు
  • టీడీఎస్/టీసీఎస్ సర్టిఫికెట్ల జారీ ఆగస్టు 15 వరకు పొడిగింపు
  • పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసే గడువు కూడా పెంపు

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్నులు  దాఖల చేసేందుకు గడువును ఐటీ డిపార్ట్ మెంట్ మరింత పెంచింది. నవంబర్ 30 వరకు గడువును పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా సంక్షోభ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. మరోవైపు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రివైజ్డ్ ఐటీ రిటర్నులను ఫైల్ చేసే సమయాన్ని ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసే గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది.

పన్ను ఆడిట్ రిపోర్ట్ నివేదిక గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టీడీఎస్/టీసీఎస్ సర్టిఫికెట్ల జారీని ఆగస్టు 15 వరకు పొడిగించినట్టు ఐటీ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News