12 O Clock: చెప్పినట్టుగానే '12 ఓ క్లాక్' చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ... పక్కా హారర్!

RGV releases his new horror movie trailer

  • లాక్ డౌన్ లోనూ సినిమాలు తీస్తున్న వర్మ
  • తాజాగా '12 ఓ క్లాక్' పేరుతో హారర్ చిత్రం ప్రకటన
  • కీలకపాత్రల్లో మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్థి, మకరంద్ దేశ్ పాండే
  • సంగీతం అందిస్తున్న కీరవాణి

అందరికీ లాక్ డౌన్... నాకు మాత్రం కాదు అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలతో విజృంభిస్తున్నారు. ఇప్పటికే 'క్లైమాక్స్', 'కరోనా వైరస్', 'నేకెడ్' అంటూ తనదైన శైలిలో రూపొందించిన చిత్రాలను కొన్నింటిని ప్రేక్షకుల మీదికి వదిలిన వర్మ... తాజాగా 12 ఓ క్లాక్ అంటూ హారర్ చిత్రాన్ని ప్రకటించారు. దీని ట్రైలర్ ఈ సాయంత్రం రిలీజ్ చేశారు. జానర్ కు తగ్గట్టుగానే హారర్ ఎలిమెంట్ ను బాగానే ఉపయోగించుకున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

మకరంద్ దేశ్ పాండే, ఆశిష్ విద్యార్థి, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా, ఈ హారర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఎంఎం కీరవాణి కావడం విశేషం. వర్మ ఇటీవలి సినిమాలు చూస్తే ఓ మోస్తరు నటవర్గం, సాధారణ సాంకేతిక నిపుణులతో లాగించేస్తున్నారు. ఈ సినిమాకు కాస్త మోతాదు పెంచినట్టు అర్థమవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News