పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శర్వానంద్
- పోలీస్ ఆఫీసర్ పాత్రలపై మన హీరోల మక్కువ
- గతంలో 'రాధ' చిత్రంలో చేసిన శర్వానంద్
- తాజాగా యూవీ క్రియేషన్స్ చిత్రంలో మరోసారి
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ శర్వానంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి నూతన దర్శకుడు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను శర్వా బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారట. ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాలు పూర్తయ్యాక శర్వానంద్ ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు.