Devineni Uma: వైఎస్‌ఆర్‌కి కొత్త అర్థం చెప్పిన దేవినేని ఉమ

devineni fires on ycp

  • వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీబాబాయ్)కి 5 జిల్లాలు
  • ఎస్‌-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు పంచారు
  • ఆర్‌-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు
  • సెర్చ్ కమిటీల్లో12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 'వైఎస్‌ఆర్‌లో వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీ బాబాయ్)కి 5 జిల్లాలు,ఎస్‌-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు, ఆర్‌-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు పంచారు. సెర్చ్ కమిటీల్లో12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే. మీ ప్రభుత్వ పెత్తందారీ నియామకాలపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ఉందా?' అని దేవినేని ఉమ నిలదీశారు. పార్టీ బాధ్యతలు, రాష్ట్రంలోని ముఖ్య వ్యవహారాలు ముగ్గురికే ఇచ్చారని విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. ఏపీలోని 13 జిల్లాలను ముగ్గురికి పంచారంటూ సీపీఐ నేతలు చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. ఆ ముగ్గురికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారని, వైసీపీలో ఇంకెవరూ సమర్థులు లేరా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించినట్లు అందులో ఉంది. మిగతా కులాలను డమ్మీ చేశారని, రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయం సజ్జల రామకృష్ణారెడ్డికి, అనుబంధ విభాగాలు విజయసాయిరెడ్డికి అప్పగించారని చెప్పారు.

Devineni Uma
Telugudesam
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News