Gandhi Hospital: మారిన నిబంధనలు... 'గాంధీ'లో కరోనా బాధితుల తాజా డైట్ ఇది!

Gandhi Hospital Diet Menu for Corona Patients
  • పోషకాహారంతో కూడిన భోజనం
  • టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ మెనూ విడుదల
  • డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్స్ కు కూడా ఇదే మెనూ
ప్రత్యేక కరోనా చికిత్సా కేంద్రంగా ఉన్న హైదరాబాద్, గాంధీ ఆసుపత్రిలో రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు, డైట్ ను మార్చారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డిస్పోజబుల్ పాత్రల్లో మాత్రమే అందించాలని ఆసుపత్రి వర్గాలు నిర్ణయించాయి.

ఇక, డైట్ గా ఏమిస్తున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే, ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య అల్పాహారంగా ఇడ్లి, పూరి, బొండా, ఉప్మా, ఊతప్పం లలో ఏదో ఒకదానితో పాటు పాలు అందిస్తారు. ఆపై 10 గంటలకు బిస్కెట్లతో పాటు టీ లేదా కాఫీ ఇస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండు, కూర, మినరల్ వాటర్ బాటిల్ ను ఇస్తారు.

దాని తరువాత సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల్లోపు ప్రత్యేక పోషకాహారంగా కాఫీ లేదా టీతో పాటు ఖర్జూరం, బాదంపప్పు, అంజీర్‌ ఇస్తారు. రాత్రి డిన్నర్ లో అన్నంతో పాటు కూర, సాంబారు, పెరుగు, పప్పు, మరో కోడిగుడ్డు, అరటిపండు, మినరల్ వాటర్ ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఇక ఆసుపత్రిలోని వైద్యులు, పారిశుద్థ్య సిబ్బంది, వార్డు బాయ్స్, నర్సులకు కూడా ఇదే డైట్ ను ఇస్తారు.
Gandhi Hospital
Corona Virus
Patients
Diet

More Telugu News